Back to Browse

How to add Creator, Maker, Checker in CFMS? Workflow Configuration tile.

38.6K views
Apr 17, 2018
7:15

Comprehensive Financial Management System (CFMS) :- ఈ application ని Andhra Pradesh Centre for Financial Systems and Services (APCFSS) వారు Finance Department కొరకు తయారు చేశారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు (Recepts and Payments, Accounting) అన్నీ కాగితరహితoగా Onlineలో అమలవుతాయి. ఈ విధానం 1.4.2018 నుండి అమలులోకి వస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో Head Of the Office తమ Office లో CFMS అమలు చేయుటకొరకు (Workflow Configuration tile లో) Maker (JA/SA), Checker (Superintendent) మరియు Submitter (Drawing and Disbursing Officer) లను identity చెయ్యాలి. అందరికీ 8 అంకెల Employee Id మరియు password ఇవ్వబడతాయి. DDO తన పరిధిలో గల ఒక ఉద్యోగిని ఎంచుకొని అతనిని Maker గా create చేసుకోవాలి. DDO తన పరిధి లో ఎంత మంది ఉద్యోగులనెైనా Head of Account వారీగా Maker లను create చేసుకోవచ్చు. Maker గా నియమింప బడ్డ ఉద్యోగి మాత్రమే salary మరియు ఇతర bills తయారు చేయగలడు. అలా తయారు bills ని తన remarks రాసి Checker కి పంపుతారు. Bills ని check చేసే (Section Head) ఉద్యోగిని Checker గా create చేయాలి. వీరు bills ని check చేసి తన remarks రాసి Submitter కి పంపుతారు. తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న చోట ప్రత్యేకించి Checker అంటూ ఎవరూ ఉండవలసిన అవసరం లేదు (DDO యే check చేసుకోవాలి కాబట్టి Checker ని create చేసుకోవలసిన అవసరం లేదు). Submitter ఆ bilIs ని check చేసి , సరిగా లేకపోతే తిరిగి Maker కి పంపుతారు; bill సరిగా ఉంటే తన digital signature తో Treasury కి పంపుతారు. Role of Maker: CFMS website https://apfinance.apcfss.in లో login అయి Bill Lifecycle Management అనే tile ని click చెయ్యాలి Create bill ని click చెయ్యాలి Type of bills ని click చెయ్యాలి( AC -DC Bills / HR Bills/Non HR Bills / WorkBills etc) అన్నీ coloumns ని fill చేస్తూ bill prepare చెయ్యాలి జీతాల బిల్లులకు సంబంధించి: పూర్తి స్ధాయిలో CFMS అమలు అయ్యే వరకు ఎప్పటి వలె DDO Request లోనే TBR Number generate చేసి పాత పద్ధతిలోనే bill తయారుచేయాలి. TBR Number generate అయిన 15 నిమిషాల తరువాత CFMS లో అదే TBR Number display అవుతుంది. అవసరమైన documents ని scan చేసి (PDF formatలో) upload చెయ్యాలి Complete అయ్యాక తన remarks రాసి save and send button press చెయ్యాలి ఒక unique number (state మొత్తానికి ) generate అవుతుంది ( Token No లాంటిది). ఎవరికైతే పంపాలో వారి name (Maker) పై click చేసి send చెయ్యాలి. Role of Checker: Checker పై website లో తన Id మరియు password ద్వారా login అయి BLM లో ఆ bill కి కావలసిన requirements ని check చేసి తన remarks ని note చేసి Submitter కి పంపుతారు. Role of Submitter Submitter పై website లో తన Id మరియు password ద్వారా login అయి BLM ని click చేసి ఆ bill ని check చేసి; correct గా లేకపోతే తన remarks రాసి Checker లేదా Maker కి పంపుతారు correct గా వుంటే Treasury కి పంపుతారు Treasury లో: ప్రతి Treasury లో HOO కూడా తమ Office లో CFMS అమలు చేయుటకొరకు (Workflow Configuration tile లో) Auditer (JA/SA), Verifier (STO - optional) మరియు Approver (STO/ATO/AD/DD) లను identity చెయ్యాలి. Role of Auditor: Auditor పై website లో తన Id మరియు password ద్వారా login అయి inbox లో ఉన్న bills మరియు scanned documents ని check చేసి correct గా లేకపోతే తన objections ని; correct గా ఉంటే తన remarks ని; textbox లో రాసి Verifier కి పంపుతారు. Role of Verifier: Verifier పై website లో తన Id మరియు password ద్వారా login అయి inbox లో ఉన్న bills మరియు scanned documents ని force లో ఉన్న Rules ప్రకారం check చేసి correct గా లేకపోతే తన objections ని; correct గా ఉంటే తన remarks ని; textbox లో రాసి Approver కి పంపుతారు. Role of Approver: Approver పై website లో తన Id మరియు password ద్వారా login అయి inbox లో ఉన్న bills మరియు scanned documents ని force లో ఉన్న Rules ప్రకారం check చేసి correct గా లేకపోతే తన objections తో DDO/Verifier/ Auditor కి correct గా ఉంటే తన remarks ని textbox లో రాసి approve చేస్తారు. Bill approve చేసిన రెండు గంటలలో RBI నుండి Beneficiary కి payment అవుతుంది. Payment అయేవరకు ఎన్ని సార్లు bill ని return చేసినా చివర వరకు అదే unique number కొనసాగుతుంది.

Download

0 formats

No download links available.

How to add Creator, Maker, Checker in CFMS? Workflow Configuration tile. | NatokHD